: ‘రూ.1.20 కోట్ల వార్షిక వేతనం ఇస్తాం’.. ఐఐటీ విద్యార్థికి ఒరాకిల్ కంపెనీ ఆఫర్!
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ వారణాసిలోని ఐఐటీ-బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్లేస్‌మెంటు నిర్వహించి ఓ విద్యార్థికి కళ్లు చెదిరే ప్యాకేజీని ఇస్తామని తెలిపింది. ప్లేస్‌మెంటు నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ... తమ వర్సిటీ నుంచి ఎంపికయిన ఆ విద్యార్థికి సదరు సంస్థ రూ.1.20 కోట్ల వార్షిక వేతనంగా చెల్లిస్తామని చెప్పిందని తెలిపారు. తాజాగా నిర్వహించిన ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయిన వారిలో అధికమంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులే ఉన్నారని తెలిపింది.
తమ వర్సిటీలో గతేడాది నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కూడా ఓ విద్యార్థికి ప్రముఖ సర్చింజన్ గూగుల్ సంస్థ ఎంపిక చేసుకుందని, ఆ విద్యార్థికి 2.27 కోట్ల వార్షిక ప్యాకేజీ ఇస్తోందని చెప్పారు. తమ క్యాంపస్‌లో ఈ ఇంటర్వ్యూలు ఈ నెల 1న ప్రారంభమయ్యాయని మరో ఐదురోజుల పాటు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.