: ఈ ప‌ట్టీని అతికించుకోండి.. పక్షవాతం, గుండెపోటు ముప్పులకు దూరంగా ఉండండి!


నార్త్‌ కరోలినా యూనివ‌ర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తాజాగా వెంట్రుక కంటే సన్ననైన సూక్ష్మ సూదులుండే ఓ సరికొత్త హైటెక్‌ పట్టీని తయారుచేశారు. ఈ ప‌ట్టీని చ‌ర్మంపై ఎక్క‌డైనా అతికించుకుంటే పక్షవాతం, గుండెపోటు వచ్చే ముప్పును ముందుగానే పసిగట్టి, ఆ ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలో త్రాంబిన్‌ స్థాయులు అధిక‌మ‌వ‌డం వ‌ల్ల నాళాల్లో ర‌క్తం చిక్కబడి గడ్డక‌డుతుంద‌న్న విష‌యం తెలిసిందే. ఇలాంటి స్థితిని ఎదుర్కుంటున్న వారు సాధార‌ణంగా ‘హెపారిన్‌’ అనే మాత్ర‌ల‌ను వాడుతుంటారు. ఈ మాత్రలు వేసుకుంటే చిక్క‌బ‌డ్డ‌ రక్తం తిరిగి పలుచ‌బ‌డి ర‌క్త‌ ప్రసరణ ఎటువంటి ఆటంకాలు లేకుండా చూస్తుంది. ఈ మాత్రల‌ను అధికకాలం వాడితే సైడ్ ఎఫెక్ట్స్ లు క‌లుగుతాయి.

అయితే,  ‘హెపారిన్‌’ మాత్రల‌ కంటే శాస్త్ర‌వేత్త‌లు త‌యారుచేసిన‌ ఈ మాలిక్యుల్ ప‌ట్టీ 2000 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేగాక‌,  శాస్త్ర‌వేత్త‌లు తాజాగా త‌యారుచేసిన‌ ఈ ప‌ట్టీతో ఈ ప‌ని మ‌రింత సుల‌భం అవ్వ‌డ‌మే కాకుండా ఎలాంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. చ‌ర్మంపై అంటిస్తే చాలు, ఎలాంటి నొప్పి లేకుండా, చర్మంలోకి వెళ్లి రక్తంలోని త్రాంబిన్‌ గాఢతను పసిగ‌డుతుంది. మ‌న దేహంలో రక్తం చిక్కబడే పరిస్థితి ఉన్నట్లు క‌నబ‌డితే ఆ రక్తాన్ని పలుచన చేసేందుకు మ‌న‌ శరీరంలో ఉండే ‘యాంటీత్రాంబిన్‌-3’ పదార్థాన్ని ఈ పట్టీ స‌న్న‌ని సూదుల ద్వారా రక్తంలోకి పంపుతుంది.

  • Loading...

More Telugu News