: ఉద్యోగినితో రాసలీలల ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక మంత్రి రాజీనామా


కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్‌వై మేతి రాజీనామా చేశారు. సదరు మంత్రి కర్ణాటక అసెంబ్లీలోని తన ఆఫీసులో రాసలీలలు సాగించారని ఇటీవ‌ల ఆరోపణలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త‌న ఉద్యోగం బ‌దిలీ విష‌యంలో బాగల్‌కోట్‌కు చెందిన ఓ ఉద్యోగిని మంత్రిని క‌లిసిన‌ట్లు... అయితే, ఈ క్ర‌మంలో మేతీ ఆమెతో ప‌లుమార్లు రాసలీలలు సాగించారని ఎన్నో ఆరోపణలు వ‌చ్చాయి. అసెంబ్లీ కార్యాల‌యంలో ఉద్యోగినితో రాస‌లీల‌లు సాగిస్తుండగా, ఆ దృశ్యాలను ఆయన మాజీ గన్‌మన్ సుభాష్ రహస్యంగా వీడియో తీయడంతో ఆ వీడియో బయటకు వ‌చ్చింది. దీంతో త‌మ పార్టీకి న‌ష్టం క‌లగ‌కుండా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామయ్య మంత్రి మేతిని రాజీనామా చేయాల‌ని ఆదేశించిన‌ట్లు తెలిసింది. దీంతో సిద్ధ‌రామయ్యకు మేతి త‌న‌ రాజీనామా లేఖ‌ను అందజేశారు.

  • Loading...

More Telugu News