: విద్యుత్ ప్రాజెక్టు కుంభ‌కోణంలో కేంద్రమంత్రి ప్ర‌మేయం ఉందంటూ లోక్‌స‌భ‌లో నినాదాలు.. వాయిదా


అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న‌ 600 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తు అవినీతి జరిగిందని, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయ‌ని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేత‌లు ఈ రోజు లోక్‌స‌భ‌లో ఈ అంశాన్నే లేవ‌నెత్తారు. వాయిదా అనంత‌రం ఈ రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్రారంభమైన లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ నేత‌లు ఈ అంశంపై నినాదాలు చేశారు. ఈ కుంభ‌కోణంలో కేంద్ర మంత్రి కిర‌ణ్‌ రిజిజు పాత్ర ఉంద‌ంటూ, ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ ప్రాజెక్టు బిల్లుల చెల్లింపులో ఆయ‌న అధికారుల‌పై ఒత్తిడి చేశారంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. మరోవైపు తాము ఏ అంశంపై అయినా చర్చించడానికి సిద్ధంగానే ఉన్నామని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. అయినప్పటికీ లోక్‌స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో స‌భ‌ను రేప‌టివ‌ర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ప్ర‌క‌టించారు.  

  • Loading...

More Telugu News