: చైనా వస్తువులకు ప్రచారం చేస్తావా?: సైనా నెహ్వాల్ పై అభిమానుల ఆగ్రహం
ఇండియన్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ పై ఆమె అభిమానులే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ 'ఆనర్8'కి సైనా బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఆనర్8ని పట్టుకుని దిగిన ఫొటోను ఆమె ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది. అంతేకాదు, "నా కొత్త ఆనర్8 ఫోన్... ఫోన్ ను, దాని కలర్ ను ఎంతో ఇష్టపడుతున్నా" అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఈ పోస్ట్ పై ఆమె అభిమానులు విరుచుకుపడున్నారు. చైనా కంపెనీకి ప్రచారం చేయడాన్ని వెంటనే ఆపివేయాలని కొందరు మండిపడ్డారు. దేశానికి వ్యతిరేకమైన పనిని చేస్తున్నావని మరికొందరు తీవ్రంగా విమర్శించారు. చైనా వస్తువులను ప్రమోట్ చేయవద్దని... అది దేశానికి కీడు చేస్తుందని ఇంకొక అభిమాని సూచించాడు. నేను నీకు అభిమానినని... చైనా వస్తువులకు ప్రచారం చేస్తే, నిన్ను ద్వేషిస్తానని మరొక అభిమాని తెలిపాడు.