: బ్యాంకుల ముందు కుర్చీలు, టెంట్లు వేయండి: సీఎం చంద్రబాబు ఆదేశాలు
బ్యాంకుల వద్ద ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బ్యాంకర్లు, జిల్లా కలెక్టర్లు, ఆర్థిశాఖ అధికారులతో ఈ రోజు విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు. బ్యాంకుల ముందు వృద్ధులు, వికలాంగులు నిలబడి ఇబ్బందులు పడకుండా కుర్చీలు, టెంట్లు వేయడంతో పాటు పలు వసతులు కల్పించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో జన్‌ధన్ ఖాతాల వినియోగం ఇప్పటివరకు 16శాతం మాత్రమే ఉందని చెప్పిన చంద్రబాబు.. వాటి వినియోగాన్ని 30 శాతానికి పెంచేలా ప్రోత్సహించాలని చెప్పారు. నగదు కొరతను తీర్చడానికి తీసుకొచ్చిన రూపే కార్డుల పంపిణీని నాలుగు రోజుల్లో పెండింగ్ లేకుండా పూర్తిచేయాలని సూచించారు.