: పాకిస్థాన్ లో లగ్జరీ లైఫ్ గడుపుతున్న రియాజ్ భత్కల్


దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల సూత్రధారుడు, ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ పాకిస్థాన్ లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఐఎస్ఐ) నీడలో గుర్తు తెలియన ప్రదేశంలో ఉన్న ఓ భవనంలో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. హైదరాబాదులో బాంబు పేలుళ్లు జరిపినందుకు గాను, రియాజ్ భత్కల్ కు ఐఎస్ఐ భారీ ఎత్తున డబ్బు ఇచ్చిందని సమాచారం. రియాజ్ వద్ద పాక్ పాస్ పోర్టు కూడా ఉందని తెలుస్తోంది. రియాజ్ తో పాటు అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్ కు కూడా ఐఎస్ఐ ఆశ్రయం ఇస్తోందని సమచారం. 

  • Loading...

More Telugu News