: స్కానర్లకు సైతం దొరకని రీతిలో ప్యాకింగ్... పట్టుబడ్డ కోట్ల రూపాయలు


నోట్ల రద్దు తర్వాత సామాన్యుల పరిస్థితి ఎలా ఉన్నా... బడాబాబులు మాత్రం కొత్త 'కట్టల' పాములతో ఖుషీగానే ఉన్నారు. ఐటీ అధికారులు ఎక్కడ సోదాలు జరిపితే అక్కడ కోట్లాది రూపాయలు బయటపడుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఉన్న ఓ హోటల్ పై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఆదాయపు పన్ను అధికారులు సంయుక్తంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ. 3.25 కోట్లు పట్టుబడ్డాయని అధికారులు తెలిపారు. హోటల్ లోని రెండు గదుల్లో బసచేసిన ఐదుగురి నుంచి ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.  

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని అన్సారీ అబూజర్, ఫజల్ ఖాన్, అన్సారీ అఫ్ఫాన్, లాడూ రామ్, మహావీర్ సింగ్ లుగా గుర్తించారు. వీరంతా ఆ డబ్బును సూట్ కేసులు, కార్డ్ బోర్డ్ బాక్సుల్లో ఉంచారు. ఈ డబ్బంతా ముంబైలోని ఓ హవాలా ఆపరేటర్ కు చెందినదని తమ విచారణలో తేలినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ డబ్బునంతా వీరు ఓ స్పెషలిస్ట్ చేత ప్యాక్ చేయించారని... ఎయిర్ పోర్టుల్లోని స్కానర్లు సైతం లోపల ఉన్న డబ్బును గుర్తు పట్టని విధంగా ప్యాక్ చేయించారని చెప్పారు. 

  • Loading...

More Telugu News