: నోట్లు ఇంట్లో దాచుకోవద్దు.. వాడుకోండి: ప్రజలకు ఆర్బీఐ వినతి
నోట్ల రద్దు తర్వాత ప్రజల అవసరాలు తీర్చడంలో చతికిల పడిన ఆర్బీఐ ప్రజలకు సరికొత్త విన్నపం చేసింది. ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బును దాచుకోకుండా వినియోగంలోకి తేవాలని సూచించింది. తద్వారా మార్కెట్లో నోట్ల చలామణి పెరుగుతుందని పేర్కొంది. ఇలా చేయడం వల్ల కొంత వరకు కష్టాలు కడతేరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా నోట్ల రద్దు తర్వాత ఈ నెల పదో తేదీ వరకు రూ. 12.44 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లు జమ అయినట్టు వివరించింది. ఈ విషయంలో బ్యాంకు ఉద్యోగుల కృషిని కొనియాడిన ఆర్బీఐ అన్ని లావాదేవీలపైనా నిఘా పెట్టినట్టు పేర్కొంది. అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై బ్యాంకులు చర్యలు తీసుకున్నాయని వివరించింది.