: జపాన్ తో శాంతి ఒప్పందం చేసుకోనున్న రష్యా... సుదీర్ఘ సమస్యకు పరిష్కారం


ఏళ్ల తరబడి నలుగుతున్న సమస్యను పరిష్కరించాలని రష్యా, జపాన్ భావిస్తున్నాయి. తన జపాన్ పర్యటన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన పుతిన్ మాట్లాడుతూ, జపాన్ తో ఘర్షణపూరిత వాతావరణానికి స్వస్తి చెప్పాలనుకుంటున్నామని, శాంతి ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య కురిల్ దీవుల విషయంలో వివాదం నెలకొంది.

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అంటే 1945లో రష్యాకు జపాన్ ఈ దీవులను వినియోగించుకునేందుకు ఇచ్చింది. అప్పటి నుంచి అక్కడ తిష్ఠవేసిన రష్యా, వాటిని వెనక్కి ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. పుతిన్ పర్యటన సందర్భంగా ఈ వివాదాలకు స్వస్తి చెప్పి, శాంతి ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు.   

  • Loading...

More Telugu News