: తల్లి చీరతో ఉరేసుకున్న హిమేష్ రేషమియా కంపెనీ సీఈవో


ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేషమియా కంపెనీ హెచ్ఆర్ మ్యూజిక్ లిమిటెడ్ సీఈవో ఆండీ సింగ్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ముంబైలోని ఓషివారాలో తల్లితో కలిసి నివాసం ఉంటున్న ఆండీ సింగ్ తల్లి, ప్రియురాలు మాట్లాడుకుంటున్న సమయంలో ఇంట్లోని తన గదిలోకి వెళ్లి, తల్లి చీరతో ఉరివేసుకున్నాడు. కుర్చీ కిందపడ్డ శబ్దం విన్న ఆండీ సింగ్ తల్లి, ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఆండీ సింగ్ గత ఆరేళ్లుగా హిమేష్ రేషమియా మ్యూజిక్ కంపెనీలో పని చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News