: ఎంపీపీ ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడకుండా చూడండి... ఏపీ డీజీపీకి జగన్ లేఖ
ఏపీ డీజీపీ సాంబశివరావుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ లేఖ రాశారు. అనంతపురం జిల్లా కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల్లో అధికార టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. ఈ లేఖను వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డి డీజీపీ కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ ఐజీ గుప్తాకు అందజేశారు. మరోపక్క, ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కూడా కలిసి నిష్పాక్షింగా ఈ ఎన్నికలు జరపాలని కోరారు. ఈ ఎన్నికల్లో బలం లేకున్నప్పటికీ మంత్రి పరిటాల సునీత అభ్యర్థిని నిలబెట్టారని, దీంతో దౌర్జన్యానికి పాల్పడే అవకాశం ఉందని ఆ పార్టీ ఆరోపిస్తోంది.