: ఆన్‌లైన్ లావాదేవీతో కమలాఫలాలను కొనుక్కున్న మహారాష్ట్ర సీఎం
నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత దేశవ్యాప్తంగా నగదు కొరతతో ప్రజలు బాధపడుతుండడంతో ఆన్‌లైన్ లావాదేవీల వైపునకు మళ్లాలని బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు పిలుపునిస్తోన్న సంగతి తెలిసిందే. వాటిపై అవగాహన కల్పించాలని ప్రధాని మోదీ కూడా బీజేపీ నేతలకు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రజలను ఉత్సాహపరుస్తూ ఈ రోజు తన మొబైల్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీతో నాగ్‌పూర్‌లోని ఓ మార్కెట్లో కమలా ఫలాలను కొనుక్కున్నారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా ఇదే విధంగా కమలాలను కొనుక్కుని తీసుకెళ్లి ప్రజలను ప్రోత్సహించారు.