: జయలలిత మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన శశికళ పుష్ప


జయలలిత మరణం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారి జాబితా పెరుగుతోంది. ఆమె మృతి పట్ల ఎన్నో అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినీ నటి గౌతమి పలు అనుమానాలతో ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, కొందరు గౌతమి దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టి, తమ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు, జయ మేనకోడలు దీప కూడా పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ఐదు సంవత్సరాలుగా ఏదో కలిపిన ఆహారాన్ని జయలలితకు అందించారని శశికళ పుష్ప తీవ్ర ఆరోపణలు చేశారు. ఆసుపత్రిలో జయలలితకు ఎలాంటి చికిత్స అందించారనే విషయం కూడా ఎవరికీ తెలియదని... అత్యంత గోప్యతను పాటించారని మండిపడ్డారు. జయ మరణం వెనుక కుట్ర ఉందని తేల్చి చెప్పారు. 

  • Loading...

More Telugu News