: ఒక పెళ్లి అతని జీవితాన్నే మార్చేసింది!


బతుకు ఇంత ఘోరంగా ఉంటుందని ముందే ఊహించి ఉంటే... అసలు ఆ పెళ్లే చేసుకోకపోయేవాడేమో! ఆ వివరాల్లోకి వెళ్తే, గుజరాత్ లోని కచ్ జిల్లా భుజ్ కు చెందిన అల్తాఫ్ పలేజా పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన సిద్రా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, కచ్ జిల్లా పాక్ సరిహద్దు ప్రాంతం కావడం, ఉగ్రవాద దాడులు, పాక్ సైనికుల కాల్పులు లాంటి అంశాల నేపథ్యంలో... ఆమె కుటుంబసభ్యులను కచ్ జిల్లాలోకి అనుమతించేందుకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో, తన అత్తామామల కోసం భార్యను తీసుకుని ఊరికి దూరంగా వేరే ప్రాంతంలో ఉంటున్నాడు అల్తాఫ్.

సరిగ్గా ఎనిమిది నెలల క్రితం సిద్రా, ఆమె కుటుంబీకులు ఇండియాకు వచ్చారు. కచ్ జిల్లాలో తప్ప ఇతర ప్రాంతాల్లోనే ఉండాలనే నిబంధనతో మోర్జి జిల్లాకు మకాం మార్చాడు అల్తాఫ్. అయితే, వారికి ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకురావడం లేదు. సిద్రా కుటుంబీకులు పాకిస్థాన్ నుంచి వచ్చారనే కారణంతో ఇంటిని ఇవ్వలేమంటూ ముఖంమీదే చెప్పేస్తున్నారట. దీంతో, విధిలేని పరిస్థితుల్లో ఓ హోటల్ లోనే మకాం పెట్టాడు అల్తాఫ్. తన భార్యను సొంతూరుకు తీసుకువెళ్లలేక, వేరే ప్రాంతంలో హోటల్ లో నివసించలేక అల్తాఫ్ నానా బాధలు పడుతున్నాడు. తన భార్యను సొంతూరుకు తీసుకెళ్లేందుకు అధికారులు ఎందుకు అనుమతించడం లేదో కూడా అర్థం కావడం లేదని అల్తాఫ్ వాపోతున్నాడు.

  • Loading...

More Telugu News