: రూ. 50 కోట్లు ఇవ్వకుంటే మమతా బెనర్జీని హతమారుస్తాం!: జైషే మహమ్మద్ లేఖ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేస్తామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చింది. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాది చేతిరాతతో ఉన్న ఈ లేఖ ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ కు వచ్చింది. తమ గ్రూప్ కు వెంటనే రూ. 50 కోట్లను డివిజన్ రైల్వే జనరల్ మేనేజర్ అందించాలని లేఖలో సదరు ఉగ్రవాది డిమాండ్ చేశాడు. తమ డిమాండ్ ను నెరవేర్చకపోతే మమతను హతమార్చడమే కాక, ఐఈడీతో హౌరా రైల్వే స్టేషన్ ను పేల్చి వేస్తామని హెచ్చరించారు. లక్షలాది మంది ప్రయాణికులను చంపేస్తామని బెదిరించారు.
ఈ బెదిరిపు లేఖను దూరదర్శన్ మాజీ ఉద్యోగి ఎస్.సి.దాస్ రాసినట్టు కూడా అనుమానాలు ఉన్నాయి. గతంలో జైషే మహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులకు తన ప్లాట్ లో ఆయన ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ లెటర్ ను పోలీసులకు అందించినట్టు డివిజనల్ రైల్వే మేనేజర్ బద్రినారాయణ్ తెలిపారు.