: ‘వార్ధా’ ఎఫెక్ట్: నేడు చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు


‘వార్ధా’ తుపాను ఏపీని కూడా భయపెడుతోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తుపాను ప్రభావంతో  పలుచోట్ల జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. చిత్తూరు జిల్లా పనబాకంలో తుపాను ధాటికి ఒకరు మృతి చెందినట్టు కమిషనర్ వినయ్‌చంద్ తెలిపారు. తుపాను ప్రభావంతో తిరుపతిలో 9, తిరుమలలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది..

  • Loading...

More Telugu News