: ఉన్ని దుప్పట్లు కప్పి దేవుళ్లను రక్షిస్తున్న పూజారులు
భూమి మీద చలి పెరిగిపోతోందని, చలి నుంచి దేవుడ్ని రక్షించాలని ఉత్తరప్రదేశ్ లోని పూజారులు ఉన్ని రగ్గులు కప్పుతూ దేవుళ్లను కాపాడుతున్నారు. ఆ విధంగా ఉత్తరప్రదేశ్ లోని పలు దేవాలయాల్లోని విగ్రహాలకు పూజారులు ఉన్ని దుప్పట్లు కప్పుతుండగా, భక్తులు కూడా పట్టు వస్త్రాలకు బదులు ఉన్ని దుస్తులను కానుకలుగా సమర్పిస్తున్నారు. అలాగే దేవాలయాలను ఆలస్యంగా తెరుస్తూ, తొందరగా మూసేస్తున్నారు. తద్వారా చలి నుంచి దేవుడ్ని కాపాడుతున్నారు అక్కడి పూజారులు.