: రోడ్డు పక్కన దొరికే రాయిని సూప‌ర్‌మార్కెట్లో అమ్ముతున్నారు.. జనం ఎగ‌బ‌డి కొంటున్నారు!


ఇంట్లో అలంక‌ర‌ణ కోసం ప‌లుర‌కాల వ‌స్తువుల‌ను వేరే దేశాల నుంచి తెప్పించుకోవ‌డ‌మో, ప్ర‌త్యేకించి త‌యారు చేయించుకోవ‌డ‌మో చేస్తుంటాం. అయినా వాటిని ఇంటికి వ‌చ్చిన బంధువులు చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేస్తారు. అయితే, ఏ విశేషం లేని రాయిని ఇంట్లో పెట్టుకుంటే అతిథులు ఆ రాయి గురించి మరీ మ‌రీ అడిగి తెలుసుకుంటారు. అది రోడ్డుపై దొరికే ఒట్టి రాయేనని చెబితే ఆశ్చర్యపోవ‌డం అతిథుల వంతు అవుతుంది. ఇటువంటి ఆశ్చర్యాన్ని కలిగించాలనే అమెరికాలోని నార్డ్‌స్టార్మ్‌ సూపర్‌ మార్కెట్ ఇటువంటి రాళ్ల‌ను విక్ర‌యిస్తూ బిజినెస్ చేసుకుంటోంది.

ఎప్పుడూ ఇంట్లోని వ‌స్తువులు ఒకేలా ఉంటే అతిథుల‌తో పాటు ఇంట్లో వారికి బోర్‌ కొడుతుంద‌న్న ఆలోచనతోనే ఇటువంటి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. విభిన్నమైన ఆలోచనలతో ఈ సూప‌ర్ మార్కెట్ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకర్షిస్తోంది.  రోడ్డు పక్కన దొరికే రాయిని లెదర్‌ పౌచ్‌లో పెట్టి ఇలా అమ్ముతూ సొమ్ము చేసుకుంటోంది. 3×4, 5×2 అంగుళాల పరిమాణంలోని రాళ్ల ధ‌ర ఒక్కోటి రూ. 5,800 రూపాయలు. అంత డ‌బ్బు పెట్టి కొన‌లేని వారికోసం ఇంకొంచం చిన్న పరిమాణంలోని రాళ్లను రూ. 4,400లకు అమ్ముతున్నారు. కొంద‌రు ఈ రాళ్ల‌ను ఎగ‌బ‌డి కొంటుంటే, మ‌రి కొంద‌రు సూప‌ర్ మార్కెట్లో రాళ్ల‌ను అమ్మ‌డం ఏంటీ? వాటిని కొన‌డం ఏంటి? అంటూ ముక్కున‌ వేలు వేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News