: వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ దుర్గేష్


తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ఈరోజు వైఎస్సార్సీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దుర్గేష్ తో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, ఆయన అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం, దుర్గేష్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న జగన్, ప్రజల పక్షాన పోరాడుతున్నారని, అందుకే, తాను ఈ పార్టీలో చేరానని చెప్పారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని దుర్గేష్ చెప్పారు.

  • Loading...

More Telugu News