: చెన్నయ్ రైల్వేస్టేషన్ లో చిక్కుకుపోయిన అయ్యప్పభక్తులు
వార్దా తుపాన్ ప్రభావం కారణంగా రవాణా స్తంభించడంతో అయ్యప్పభక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. తుపాన్ కారణంగా చెన్నయ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శబరిమలకు వెళ్లిన వెయ్యిమంది అయ్యప్పభక్తులు చెన్నయ్ రైల్వేస్టేషన్ లో చిక్కుకుపోయారు. ఈరోజు ఉదయం నుంచి తమకు తిండితిప్పలు లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.