: చేతిలో గ్లాసుతో చైతూ, తర్వాత అఖిల్, ఆ తర్వాత నాగ్.. పార్టీ టైమ్!


ప్రముఖ సినీ హీరో నాగార్జున ఈ మధ్య కాలంలో తన కుమారులు నాగచైతన్య, అఖిల్ లతో టైమ్ బాగా స్పెండ్  చేస్తున్నారు. తాజాగా ఓ ఫొటోను నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. 'నా కుమారులతో కలసి గొప్ప సాయంత్రాన్ని ఎంజాయ్ చేశా' అంటూ కామెంట్ కూడా పెట్టారు. అఖిల్, శ్రియా భూపాల్ ల నిశ్చితార్థం ఈ నెల 9న జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శనివారంనాడు చిలనచిత్ర ప్రముఖులకు నాగార్జున గ్రాండ్ పార్టీ ఇచ్చారు. నాగ్ అప్ లోడ్ చేసిన ఫొటో ఆ పార్టీలో దిగినదే. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News