: మరో బాంబు పేల్చిన ట్రంప్... వీసా దుర్వినియోగాలపై విచారణ జరిపిస్తామంటూ వెల్లడి


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇప్పటికే హెచ్1బీ వీసాలను కఠినతరం చేస్తామని హెచ్చరించిన ఆయన... తాజాగా, వీసా దుర్వినియోగాలపై విచారణ జరిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వీసాలను దుర్వినియోగం చేస్తూ, అమెరికాలో ఉంటూ అమెరికన్లకు ఉద్యోగాలను దూరం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. వీసా దుర్వినియోగాలపై దర్యాప్తు చేయాలంటూ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికశాఖను ఆదేశిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో, భారతీయులు సహా పలు దేశస్తులు వీసా విషయంలో కఠిన పరిశీలనను ఎదుర్కొనే పరిస్థితి తలెత్తింది. 

  • Loading...

More Telugu News