: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే సీఎం: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ లో అప్పుడే సీఎం కుర్చీ లొల్లి ప్రారంభమయింది. ముఖ్యమంత్రి కావాలన్న ఆశ చాలా మంది కాంగ్రెస్ నేతలకు ఉంది. తాజాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మనసులోని మాటను బహిరంగంగా వ్యక్తీకరించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని... అప్పుడు తానే ముఖ్యమంత్రిని అవుతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో కూడా కోమటిరెడ్డి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. తనను పీసీసీ అధ్యక్షుడిని చేస్తే, రాష్ట్రమంతా పాదయాత్ర చేసి, పార్టీని అధికారంలోకి తెస్తానని చెప్పారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని తానే అంటూ ప్రకటించుకున్నారు.