: చెన్నైకి పొంచి ఉన్న పెను ముప్పు
వార్దా తుపాను అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఈశాన్య దిశగా 180 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం అయింది. ఈ సాయంత్రానికి చెన్నై సమీపంలో తుపాను తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వార్దా ప్రభావంతో తమిళనాడు తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. చెన్నై తీరంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరంపై తుపాను విరుచుకుపడబోతోంది. ఇప్పటికే తిరువళ్లూరు, కాంచీపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 36 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో, చెన్నై నగరంతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు, ఏపీలోని నెల్లూరు. ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.