: మహిళా అతిథిని పిలిపించుకుని దొరికిపోయిన ‘పాక్’ క్రికెటర్
విదేశీ మహిళా అతిథిని పిలిపించుకుని అడ్డంగా దొరికిపోయాడు పాకిస్థాన్ క్రికెటర్. చివరకు, మందలించి ఆ క్రికెటర్ ను వదిలేశారట. స్పోర్ట్స్ కీడ డాట్ కామ్ అనే వెబ్ సైట్ కథనం ప్రకారం.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొంటున్న పాకిస్థాన్ క్రికెటర్, ఆల్ రౌండర్ అయిన అతను తన హోటల్ గదికి మహిళా అతిథిని పిలిపించుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న సంబంధిత అధికారులు అతన్ని గట్టిగా మందలించారట. సదరు క్రికెటర్ తన హోటల్ గదికి పిలిపించుకున్న విదేశీ మహిళ అవినీతి నిరోధకశాఖ అధికారుల జాబితాలో ఉందని సమాచారం. అంతర్జాతీయ ఒప్పందంలో ఉండటం వల్లే ఆ క్రికెటర్ పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, మహిళా అతిథులను ఇంకెప్పుడు గదులకు పిలిపించుకోవద్దని హెచ్చరించి వదిలేశారని ఆ వెబ్ సైట్ కథనం. అయితే, ఆ క్రికెటర్ పేరును అధికారులు బయటపెట్టకపోవడం గమనార్హం.