: కైరోలో చర్చి వద్ద బాంబు పేలుడు...25 మంది మృతి


ఈజిప్టు రాజధాని కైరోలో చర్చి వద్ద బాంబు పేలిన సంఘటనలో 25 మంది మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. ఈరోజు జరిగిన ఈ సంఘటనపై స్థానిక మీడియా కథనం ప్రకారం, చర్చి ఆవరణలో అమర్చిన బాంబును పేల్చి ఈ దారుణానికి పాల్పడ్డారని కొందరు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. బాంబు పేలుడు అనంతరం, రక్తసిక్తంగా మారిన ఈ ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. ఈ సంఘటనకు ఎవరు బాధ్యులనే విషయం ఇంకా తెలియలేదు.

  • Loading...

More Telugu News