: ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందిస్తూనే ఉంటా: నటుడు విజయ్ ఆంటోని
ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందిస్తూనే ఉంటానని దక్షిణాది నటుడు విజయ్ ఆంటోని చెప్పాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను ఇండస్ట్రీలో ఉన్నంత వరకూ, పనిచేసినంత వరకూ తాను తెలుగు, తమిళ్ భాషల్లో మంచి చిత్రాలను తప్పకుండా అందిస్తానని చెప్పాడు. తాను దర్శకుడిగా మారే అవకాశం మాత్రం లేదని చెప్పారు. ‘మళ్లీ మనం కలుద్దామని ఆశిస్తున్నాను’ అని చెప్పిన యాంకర్ తో.. ‘వై హోప్.. వీ ఆర్ మీటింగ్ అగైన్’ అని విజయ్ ఆంటోని చాలా ధీమాగా చెప్పడం విశేషం. కాగా, విజయ్ ఆంటోని హీరోగా గత ఏడాది విడుదలైన ‘బిచ్చగాడు’ చిత్రం బాక్సాఫీసు రికార్డులు నెలకొల్పింది. తాజాగా, విజయ్ నటించిన ‘భేతాళుడు’ చిత్రం విడుదలైంది.