: ఏపీకి తప్పనున్న ‘వార్దా’ ముప్పు!
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ పశ్చిమ నైరుతి దిశగా కదులుతుండటంతో అది తమిళనాడు వైపుగా దూసుకుపోతోంది. దీంతో, ఏపీకి ‘వార్దా’ ముప్పు తప్పనుంది. చెన్నై వద్ద తీరం దాటే అవకాశం ఉందని సంబంధిత శాఖాధికారులు పేర్కొన్నారు. తీవ్ర తుపాన్ గా మారిన ‘వార్దా’, రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.