: ముంబయి టెస్టు.. భారత్ 631 ఆలౌట్
ముంబయిలోని వాంఖడే మైదానంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 631 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. రషీ ద్ బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్(9) క్యాచ్ అవుట్ అవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కాగా, కోహ్లీ (235) డబుల్ సెంచరీ సాధించగా, అతడికి జయంత్ యాదవ్ (104) పూర్తిగా సహకరించాడు. అంతకుముందు లంచ్ విరామసమయానికి భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఎనిమిదో వికెట్ కు వీరిద్దరూ 241 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టు స్కోరు 605 వద్ద జయంత్ యాదవ్, 615 పరుగుల వద్ద కోహ్లీ అవుటయ్యారు. ఆ తర్వాత కొద్ది సేపటికే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 231 పరుగుల అధిక్యం సాధించింది. కాగా, ఇంగ్లాండ్ బౌలర్లు రషీద్ నాలుగు వికెట్లు, రూట్, అలీ లు రెండు వికెట్లు, బాల్, వోక్స్ లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.