: ఐఫోన్, ఐపాడ్ లలో డౌన్ లోడ్ అయిన యాప్స్ లో పేటీఎం టాప్
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఐఫోన్, ఐపాడ్ లలో డౌన్ లోడ్ అయిన యాప్స్ ఏవో తెలుసా...? నోట్ల రద్దు కారణంగా భారత్ లోని ఐఫోన్ యూజర్లు పేటీఎంను ఎక్కువగా డౌన్ లోడ్ చేసేస్తున్నారు. డిసెంబర్ 10తో ముగిసిన వారంలో భారత్ లో అత్యధిక సంఖ్యలో డౌన్ లోడ్ అయిన ఐఫోన్, ఐపాడ్ యాప్ ఇదేనట. ఇదే సమయంలో అమెరికాలో ఐఫోన్, ఐప్యాడ్ లో డౌన్ లోడ్ అయిన టాప్ యాప్ బిట్ మోజీ. ఇమోజీలను, చిన్న కార్టూన్ బొమ్మలను బిట్ మోజీ యాప్ లో క్రియేట్ చేసుకునే సౌలభ్యం ఉంది. యూజర్ ఫొటోకి భావోద్వేగాలు, స్పందనలను సైతం జోడించవచ్చు. బ్రిటన్ లో వాట్సాప్, ఆస్ట్రేలియాలో ఫేస్ బుక్, చైనాలో క్యూక్యూ (సోషల్ నెట్ వర్కింగ్ యాప్), ఫ్రాన్స్ లో గేమ్ యాప్ ఫైట్ లిస్ట్, కెనడాలో రేసింగ్ గేమ్ యాప్ హిల్ క్లైంబ్ రేసింగ్ 2, దక్షిణ కొరియాలో ట్రాన్సెండెన్స్ ఫర్ కకావో, జపాన్ లో కోక్ ఆన్, సింగపూర్ లో ఊబర్ టాప్ డౌన్ లోడ్ యాప్స్ గా ఉన్నాయి.