: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ తమిళనాడు కేబినెట్ తీర్మానం
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తమిళనాడు కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శనివారం భేటీ అయిన కేబినెట్ మరికొన్ని తీర్మానాలను ఆమోదించింది. జయకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరడంతోపాటు పార్లమెంటులో జయ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానం ఆమోదించారు. అలాగే ఎంజీఆర్ మెమోరియల్ పేరును ఇక నుంచి భారతరత్న డాక్టర్ ఎంజీఆర్- జయలలిత మెమోరియల్‌గా మార్చాలని తీర్మానించారు. దీంతోపాటు జయ స్మారక మందిరాన్ని రూ.15 కోట్లతో నిర్మించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది.