: కర్ణాటకలో హవాలా డీలర్ నుంచి 5.7 కోట్ల కొత్త నోట్లు, 90 లక్షల పాత నోట్లు స్వాధీనం
పెద్దనోట్ల రద్దుతో అక్రమవ్యాపారుల గుట్టురట్టవుతోంది. నిన్న చెన్నైకి చెందిన మాజీ టీటీడీ బోర్డు సభ్యడు శేఖర్ రెడ్డి 124 కోట్ల రూపాయలతో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. తాజాగా, కర్ణాటకలో హవాలా డీలర్ నుంచి ఆదాయపుపన్ను శాఖాధికారులు భారీగా కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యాపారికి చెందిన రహస్య స్నానాల గదిలోంచి 5.7 కోట్ల విలువైన కొత్త 2000 రూపాయల నోట్లు, 90 లక్షల రూపాయల పాత 1000, 500 రూపాయల నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.