: రూ.15 కోట్లివ్వండి.. డేట్స్ ఇస్తా!: దీపిక కంటే ఎక్కువ అడుగుతున్న కంగనా ర‌నౌత్‌


బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఇప్పుడు సినిమా కోసం సంత‌కం చేయాలంటే ఏకంగా రూ.15 కోట్లు ఇవ్వాల్సిందేన‌ని చెబుతోంద‌ట‌. ఇంత‌వ‌ర‌కు బాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న న‌టిగా దీపికా పదుకొణె ఉంది. ప్రస్తుతం ఆమె సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ ‘పద్మావతి’ సినిమాలో టైటిల్ పాత్ర‌లో నటిస్తోంది. ఆ పాత్రకు ఆమె రూ.13 కోట్లు తీసుకుంటుండ‌గా.. ఇప్పుడు ఆమె కంటే రెండు కోట్లు ఎక్కువగా అడుగుతూ కంగనా ర‌నౌత్‌ నిర్మాతలకు షాక్ ఇస్తోంద‌ట‌. కంగ‌నా ర‌నౌత్ నటించిన‌ ‘రంగూన్‌’ చిత్రం షూటింగ్ కొన్ని రోజుల ముందే పూర్తయింది. ఇప్పుడు ఈ బాలీవుడ్ క్వీన్ ‘సిమ్రాన్‌’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ షూటింగ్ ముగియ‌గానే రాణీ లక్ష్మీబాయ్‌ జీవితం ఆధారంగా తీయ‌నున్న ఓ చిత్రంలో ఆమె పాల్గొననుంది.

  • Loading...

More Telugu News