: కాపీ ట్వీట్ పై క్షమించమని కోరిన మంచు లక్ష్మి


మంచువారి అమ్మాయి, నటి, నిర్మాత మంచు లక్ష్మి చేసిన ఓ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. "పోయిన నెల ఇదే రోజున క్యాస్ట్రో బతికి ఉన్నారు. అమ్మ కోలుకుంటున్నారు. తొలి మహిళా అధ్యక్షురాలి కోసం అమెరికా ఎదురుచూస్తోంది. మీ దగ్గర డబ్బు కూడా ఉంది", ఇది లక్ష్మి చేసిన ట్వీట్. 8వ తేదీన లక్ష్మి ఈ ట్వీట్ చేసింది. అయితే, తాను చేసిన ట్వీట్ ను లక్ష్మి కాపీ చేసిందంటూ లక్ష్మిని ట్యాగ్ చేస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. దీంతో, తన ఫ్రెండ్ ద్వారా వచ్చిన మెసేజ్ లో పేరు లేకపోవడంతో... అసలైన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకుండానే తాను ట్వీట్ చేశానని, తనను క్షమించాలని కోరింది. మంచి ట్వీట్ చేశారంటూ సదరు వ్యక్తిని అభినందించింది.

  • Loading...

More Telugu News