: జయ జీవితాన్ని చూసైనా నీతిగా బతికేందుకు ప్రయత్నించండి: నారాయణ
జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు రక్తికడుతున్నాయని సీపీఐ నేత నారాయణ చెప్పారు. జయ జీవితాన్ని చూసైనా రాజకీయ నేతలు నీతిగా బతకడానికి ప్రయత్నించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా మారారని... హిట్లర్ కూడా ఆయనలా జాతీయ సంపదను వేస్ట్ చేయలేదని విమర్శించారు. నోట్ల రద్దు ఓ అనాలోచిత నిర్ణయమని చెప్పారు. రాజకీయ అవినీతిని రూపుమాపకుండా... నల్లధనాన్ని అరికట్టడం అసంభవమని చెప్పారు. వరుస టెలికాన్ఫరెన్సులతో బ్యాంకు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు చంపుతున్నారని నారాయణ అన్నారు. మాటలు ఎక్కువ చెబుతూ, పని తక్కువగా చేస్తున్నారంటూ చంద్రబాబుపై సెటైర్ వేశారు.