: షారుఖ్ ఖాన్ కు మేజర్ సర్జరీ తప్పదట... తీవ్ర నొప్పితో బాధ పడుతున్న బాలీవుడ్ బాద్షా
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తీవ్ర మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల జరిగిన 'రాయిస్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి కూడా షారుఖ్ 'నీ బ్యాండ్' తోనే వచ్చాడు. గత కొన్ని నెలలుగా షారుఖ్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే షారుఖ్ కు మే నెలలో ఒక ఆపరేషన్ నిర్వహించారు. అయినా, పరిస్థితి ఇబ్బందికరంగానే ఉండటంతో... మరోసారి సర్జరీ జరగనుందని షారుఖ్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్లు తెలిపారు. క్రితం సారి ఆపరేషన్ నిర్వహించిన అనంతరం, విశ్రాంతి లేకుండా వరుస షూటింగుల్లో షారుఖ్ పాల్గొన్నారని... దీంతో, పరిస్థితి ఇంతకు మునుపుకన్నా అధ్వానంగా తయారయిందని డాక్టర్ సంజయ్ దేశాయ్ తెలిపారు. ఈ సారి మాత్రం ఆయన కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సిందే అని చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే మరో మేజర్ సర్జరీకి వెళ్లనున్నట్టు షారుఖ్ కూడా తెలిపాడు.