: టీటీడీ బోర్డు నుంచి శేఖర్ రెడ్డికి ఉద్వాసన!


భారీ ఎత్తున నల్లధనాన్ని కూడబెట్టిన చెన్నై వ్యాపారి, టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డికి ఉద్వాసన పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన ఇంట్లో వందల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ, బంగారం లభించిన సంగతి తెలిసిందే. ఆపై విచారణలో భాగంగా, తాను పాత కరెన్సీని కొత్త నోట్లలోకి మార్చినట్టు, ఆపై మిగిలిన పాత కరెన్సీతో బంగారం కొన్నట్టు శేఖర్ రెడ్డి అంగీకరించగా, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నేడు ప్రత్యేక ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. కాగా, టీటీడీలో ఓ తమిళ వ్యక్తికి భాగం కల్పించాలన్న ఉద్దేశంతో జయలలిత సిఫార్సుతో శేఖర్ రెడ్డికి బోర్డు సభ్యుడి హోదా దక్కిన సంగతి తెలిసిందే. ఇక జయలలితకు సన్నిహితుల్లో ఒకరిగా పేరున్న శేఖర్ రెడ్డి ఇంటిపై ఆమె చనిపోయిన తరువాత ఐటీ దాడులు జరగడం విశేషం.

  • Loading...

More Telugu News