: 2017లో అందరూ ఎదురుచూస్తున్న చిత్రం 'బాహుబలి: ది కన్ క్లూజన్'!


మరో మూడు వారాల్లో కొత్త సంవత్సరం రానుంది. 2017లో ఇండియాలో అత్యధిక సినీ ప్రేక్షకులు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు? ఆసక్తికరమైన ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఓర్మాక్స్ సంస్థ ఓ సర్వే చేసి ఫలితాలు వెలువరించింది. వచ్చే సంవత్సరంలో 51 శాతం మంది సినీ ప్రియులు 'బాహుబలి: ది కన్ క్లూజన్' కోసం వేచి చూస్తున్నారు. దీంతో 2017 మోస్ట్ అవైటెడ్ మూవీగా జక్కన చెక్కుతున్న చిత్రం నిలిచింది. ఇక రెండో స్థానంలో షారూక్ నటించిన 'రాయిస్' ఉంది. ఈ చిత్రం చూడాలని వేచి చూస్తున్నట్టు 21 శాతం మంది పేర్కొన్నారు. గోల్ మాల్-4 చూడాలని ఉందని 14 శాతం, సల్మాన్ తాజా చిత్రం ట్యూబ్ లైట్ కు 6 శాతం ఓట్లు వేశారు. ఇక శంకర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న '2.0' చిత్రానికి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వచ్చినట్టు ఓర్మాక్స్ పేర్కొంది. బాహుబలి రెండో భాగం కోసం దక్షిణాది ప్రేక్షకుల కన్నా, ఉత్తరాదివారే అధిక ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు ఈ సర్వే వెల్లడించింది.

  • Loading...

More Telugu News