: పదివేల ఏళ్లకు ఓసారి మాత్రమే జన్మించే సౌందర్యం.. చైనా కుర్రకారు ప్రశంసలు పొందుతున్న మోడల్


టాన్‌ హె అనే 16 ఏళ్ల అసియా అమ్మాయిని చూసి ఇప్పుడు ప్రపంచం కుళ్లుకుంటోంది. అచ్చం కవులు వర్ణించే శరీర సౌష్టవంతో ప్రపంచంలోని టాప్ మోడల్స్‌కు అసూయ తెప్పిస్తోంది. చైనా ఐతే ఏకంగా ఇటువంటి అందాన్ని పదివేల ఏళ్లకు ఓసారి మాత్రమే చూడగలమని అంటోంది. ఆ పదివేల ఏళ్ల సంగతి ఏమో కానీ.. ‘ఎలీట్ మోడల్ లుక్’ వెబ్‌సైట్ అందాల పోటీల్లో 70 దేశాల నుంచి 3.50 లక్షల మంది పోటీపడ్డారు. వారిందరినీ తోసిరాజని టాన్ గత నెలలో ఫైనల్‌కు చేరుకుంది. ‘‘టాన్ టైటిల్ గెలుచుకుంటే ఎలా ఉండేదో కానీ ఆమె ఓడినా గెలిచినట్టే. ఆమె అందాన్ని నిర్వచించడం ఎవరికీ సాధ్యం కాదు’’ అని చైనా యువత తెగ మెచ్చుకుంటోంది. ఇంకో మాటగా చెప్పాలంటే టాన్ అంటే పడి చచ్చిపోతోంది. గంభీరమైన ముఖ సౌందర్యం, మెరుపు తీగలాంటి శరీరంతో కుర్రకారును మత్తెక్కిస్తున్న టాన్‌ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై ప్రత్యర్థులకు దడపుట్టిస్తోంది.

  • Loading...

More Telugu News