: తిరుమల వెంకన్నకు కోటి రూపాయల విరాళం
తిరుమల వెంకన్నకు ఒక భక్తుడు భారీ విరాళం సమర్పించారు. న్యూఢిల్లీకి చెందిన ఎంఎస్ పద్మనాభన్ కోటి రూపాయల డీడీని స్వామి వారికి విరాళంగా సమర్పించారు. టీటీడీ జేఈవో శ్రీనివాసరాజును కలిసి ఆ డీడీని ఆయనకు అందజేశారు. ఈ విరాళం మొత్తాన్ని శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు డిపాజిట్ చేయాలని జేఈవోను కోరారు. అనంతరం, పద్మనాభన్ ను సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.