: 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు... రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం


ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాము స‌భ‌లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించేందుకు రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తెలంగాణ స‌చివాల‌యంలో రాష్ట్ర మంత్రివ‌ర్గం స‌మావేశం కానుంది. ఈ స‌మావేశంలో ఉభ‌య‌స‌భ‌ల్లో చర్చించాల్సిన అంశాలు, స‌భ‌ల్లో ఆమోదం కోసం పెట్టాల్సిన బిల్లులను గురించి కేసీఆర్ చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వాటితో పాటు పెద్దనోట్ల రద్దు అనంత‌రం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న‌ పరిణామాలు, క్యాష్ లెష్ ట్రాన్సాక్ష‌న్స్‌ల ప్రోత్సాహం, అమలుపై కూడా చర్చించనున్నారు. ఈ నెల 25న‌ క్రిస్మస్ పండుగ‌ సందర్భంగా క్రైస్త‌వుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫునుంచి వస్త్రాల పంపిణీ కార్య‌క్రమంపై కూడా చర్చించే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News