: బీహార్ 'టాపర్ స్కాం'లో కీలక నిందితుడి అనుమానాస్పద మృతి
కొన్ని నెలల క్రితం చోటుచేసుకున్న బీహార్ ఇంటర్ పరీక్షల కుంభకోణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు విచారణలో ఉండగానే కీలక నిందితుడు దివాకర్ ప్రసాద్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సదరు నిందితుడిని పట్టుకోవడానికి తాము వస్తుండగా గమనించిన నిందితుడు భవనం పైనుంచి దూకి చనిపోయాడని పోలీసులు అంటున్నారు. అయితే, పోలీసులే అతడిని చంపేశారని నిందితుడి బంధువులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న దివాకర్‌కు ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో సొంత ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ఈ ప్రింటింగ్ ప్రెస్‌పై కూడా ఇటీవలే దాడి చేసింది.