: వైఎస్సార్సీపీలో చేరనున్న తూ.గో.జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు


మాజీ ఎమ్మెల్సీ, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ వైఎస్సార్సీపీ లో చేరనున్నారు. ఈ నెల 12న వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. ప్రజా సమస్యలపై పోరాడతానని, వైఎస్సార్సీపీ అభివృద్ధికి, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని దుర్గేష్ పేర్కొన్నారు. పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఈయన ప్రధాన అనుచరుడిగా పేరుబడ్డారు.

  • Loading...

More Telugu News