: పెద్దనోట్ల రద్దు అంశంపై అరుణ్‌జైట్లీతో చంద్రబాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. పెద్దనోట్ల రద్దు అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలతో పాటు నగదురహిత చెల్లింపులపై ప్రజలను ప్రోత్సహించడంపై ఆయన జైట్లీకి వివరిస్తున్నారు. నగదురహిత లావాదేవీలను విస్తృతంగా పరిశీలించి తమకు నివేదిక అందించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే చంద్రబాబు సమన్వయకర్తగా ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాము సేకరించనున్న వివరాలపై జైట్లీకి చంద్రబాబు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో నెలకొన్న పరిస్థితులపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.