: విస్తుపోయే నిజాలు.. యాక్సిస్ బ్యాంకులో నకిలీ ఖాతాలు.. మొత్తం రూ.450 కోట్ల జమ
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో తనిఖీలు చేస్తోన్న ఆదాయపన్ను శాఖ అధికారులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. ఢిల్లీలోని చాందినీచౌక్ యాక్సిస్ బ్యాంకు బ్రాంచిలో పోలీసులతో కలిసి ఈ రోజు తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు ఆ బ్యాంకులో జమ అయిన డబ్బుని చూసి షాక్ కు గురయ్యారు. నవంబరు 8 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.450 కోట్లు జమ అయినట్లు నిర్ధారించారు. ఆ బ్యాంకులో 15 నకిలీ ఖాతాలు గుర్తించారు. ఆ ఖాతాల్లో రూ.70 కోట్లు జమ అయినట్లు నిర్ధారించారు.