: ఆ భూకంపమేదో పార్లమెంట్ లో ఎవరూ లేని సమయంలో వస్తే బాగుండును!: రాహుల్ వ్యాఖ్యలపై వెంకయ్య చమత్కారం
పెద్దనోట్ల రద్దు అంశంపై పార్లమెంట్ లో తనను మాట్లాడనీయడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తనదైన శైలిలో స్పందించారు. ‘నేను సభలో మాట్లాడితే భూకంపం వస్తుంది’ అని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య మాట్లాడుతూ, ‘పార్లమెంట్ లో ఎవరూ లేని సమయంలో ఆ భూకంపమేదో వస్తే బాగుండును’ అని చమత్కరించారు. అనివీతిని అంతం చేయాలని, నల్ల ధనవంతులను శిక్షించాలని అనుకోవడం తప్పా? అంటూ ప్రతిపక్షంపై వెంకయ్యనాయుడు మండిపడ్డారు. కాగా, పెద్దనోట్ల రద్దు అంశంపై పార్లమెంట్ లో తనను మాట్లాడనీయడం లేదని, తాను మాట్లాడితే భూకంపం వస్తుందని రాహుల్ వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు పెద్ద కుంభకోణమని, దానిని తాను నిరూపించగలనని రాహుల్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. నోట్ల రద్దుపై చర్చించకుండా ప్రధాని పారిపోతున్నారంటూ రాహుల్ విమర్శించారు.