: రాజ్‌నాథ్‌తో భేటీ అయిన గవర్నర్ విద్యాసాగర్ రావు.. తమిళనాడు అంశంపైనే చర్చ!
అనారోగ్యంతో బాధపడుతూ చెన్నయ్ అపోలో ఆసుపత్రిలో జయలలిత మృతి చెందడంతో తమిళనాడులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జయలలిత మరణం అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు అన్నాడీఎంకే పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను జయలలిత మిత్రురాలు శశికళకు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే జయలలిత మృతి చెందారన్న వార్తను దాచి పలువురు రాజకీయాలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీలో విభేదాలు చెలరేగుతున్నాయని, నాయకత్వం విషయంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చూస్తున్నారని కొందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. జయలలిత కన్నుమూసిన నాలుగు రోజులకే ఆయన రాజ్‌నాథ్‌ను కలవడం పట్ల అందరి దృష్టి ఇప్పుడు వారిపైనే పడింది. రాజ్‌నాథ్‌ను విద్యాసాగర్ రావు ఎందుకు కలిశారు? ఏ అంశంపై చర్చ జరుగుతోంది? అన్న ఆసక్తి నెలకొంది. వారిద్దరి మధ్య ప్రధానంగా తమిళనాడు వ్యవహారాలపైనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.