: డెబిట్ కార్డుతో రూ. 45 వేల విలువైన పట్టు చీరలు కొన్న కేటీఆర్
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా మంత్రి కేటీఆర్, తన డెబిట్ కార్డును ఉపయోగించి పట్టు చీరలు కొనుగోలు చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని దండుమల్కాపురంలోని అపెరల్ టెక్స్ టైల్స్ పార్కును సందర్శించిన ఆయన, అక్కడి చీరలను చూసి అబ్బురపడ్డారు. నేతన్నల కోసం కొత్త పాలసీని తేనున్నామని, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులను పెంచనున్నామని స్పష్టం చేసిన కేటీఆర్, వస్త్రాలను నేరుగా కొనుగోలు చేస్తామని, ఆపై మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అక్కడ తయారైన పట్టు చీరలను చూసి ముగ్ధుడైన కేటీఆర్, తన తల్లి, చెల్లెలు, సతీమణి కోసం మూడు పట్టు చీరలు కొన్నారు. చెల్న దేశాయ్ రూపొందించిన ఈ పట్మూటు చీరలతో పాటు రెండు పట్టు పావడాలను రూ. 45 వేలు పెట్టి కొనుగోలు చేసిన కేటీఆర్, ఆ డబ్బును తన డెబిట్ కార్డును స్వైప్ చేయడం ద్వారా చెల్లించారు.