: 'ఓటుకు నోటు'లో చంద్రబాబు పాత్రపై నేడు తీర్పు... అందరి కళ్లూ హైకోర్టుపైనే!


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు పాత్రపై దర్యాఫ్తు చేయాలా? వద్దా? అన్న విషయమై నేడు హైకోర్టు తీర్పివ్వనుంది. ఈ కేసులో ఏసీబీ దర్యాఫ్తు సరిలేదంటూ, వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై చంద్రబాబు స్టే తెచ్చుకోగా, సుప్రీంకోర్టు కల్పించుకున్న సంగతి తెలిసిందే. నెల రోజుల్లోగా వాదనలు విని చంద్రబాబుపై విచారణ విషయమై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును సుప్రీం ధర్మాసనం ఆదేశించగా, గత నెలలో వాద ప్రతివాదనలు జరిగాయి. తీర్పు నేటికి వాయిదా పడగా, న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

  • Loading...

More Telugu News